నేటి విద్యార్థులే రేపటి సమాజపు మానవ వనరులు…
టైనీ టాట్స్ స్కూల్ పాఠశాల వార్షికోత్సవ సభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర …
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం లో ని టైనీ టాట్స్ స్కూల్23 వ వార్షికోత్సవ వేడుకలు పండుగ వాతావరణం లో జరిగాయి.. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హజరయ్యారు… ..ఈ పోటీ ప్రపంచంలో నాణ్యత తో కూడిన విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి టైనీ టాట్స్ పాటు పడుతుని కొనియాడారు.. నేటి విద్యార్థులే రేపటి సమాజపు మానవ వనరులని..రకరకాల సిలబస్‌లు ,రకరకాల టెర్మనాలజిలో విధ్యార్థులను గందరగోళ పరుస్తున్నారని..అయినప్పటికీ ఈ స్కూల్ వికాసం తో కూడిన విద్యనందిస్తున్నదని ప్తశంసించారు..రాబోయే రోజుల్లో కూడా తల్లిదండ్రులు ఆకాంక్ష లకు పనిచేస్తు మంచి ఫలితాలు సాధించాలని కోరారు. అనంతరం
ఉత్తమ ప్రతిభ ను కనబర్చిన విద్యార్థులకు మెమంటో అందించారు ..ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండంట్ శెట్టి భాస్కర్, మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్,ఎంపీజే ఖాసిం, పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.. విద్యార్థులు ,తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హజరుకావడంతో స్కూల్ ప్రాంగణం సందడిగా మారింది..
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు::::
స్కూల్ వార్షికోత్సవం ను పురష్కకరించుకోని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇటీవలే విడుదలైన సినిమాల్లో ని పాపులర్ పాటలకు వేసిన డ్యాన్స్ లు విద్యార్థులు ను హుషారెక్కించాయి…సోషల్ మీడియా ప్రభావాన్ని స్కిట్ ల ద్వారా అవగాహన కల్పించారు..