విద్యార్థులకు బాల్యం నుంచే విద్యతో పాటు ఉత్తమ సంస్కారాలు,మానవతా విలువలు నేర్పించాలి : ఆధ్యాత్మిక శిక్షణా తరగతుల కన్వీనర్లు నాగవెల్లి ప్రభాకర్,పర్వతం శ్రీధర్ లు కోరారు.
……
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగవద్గీతా మందిరం లో ఉదయం దేవాలయాలు, ధార్మిక సంస్థల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బాలల ఆధ్యాత్మిక,వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులను ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో ఉన్నత విద్యాప్రమాణాలు పెరుగుతున్నప్పటికి మరోవైపు మానవతా విలువలు లోపిస్తున్నాయని దానికి కారణం పాఠ్య పుస్తకాలలోనైతిక విద్యకు సముచిత స్థానం కల్పించక పోవడమేనని తెలిపారు. నేటి నుండి మే 10వ తేది వరకు జరిగే ఈ శిక్షణా తరగతులకు తల్లితండ్రులు తమ చిన్నారులను పంపించి తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భగవద్గీతా మందిరం కార్యదర్శి మొరిశెట్టి రామ్మూర్తి, నాగవెళ్లి దశరథ ,రాగి భాస్కరా చారి,పర్వతం సంధ్యారాణి ,గజ్జల వెంకట్ రెడ్డి,బైరు విజయ కృష్ణతో పాటు 50 మంది విద్యార్థులు, తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.