SAKSHITHA NEWS

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ.. వారి బాధ్యతను భుజాలకెత్తుకున్న జగనన్న ప్రభుత్వం :ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జె.ఆర్.పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా జగనన్న ఆణిముత్యాలు పంపిణీ కార్యక్రమంలో10వ తరగతి ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు తన సొంత నగదును,పారితోషకాలును ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ వారి చదువుల భారాన్ని .. వైయస్ జగన్ తన భుజాలకెత్తుకున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటుబుక్ లు,మూడు జతల యూనిఫాం,ఒక జత బూట్లు,రెండు జతలు సాక్సులు, బెల్టు,స్కూల్ బ్యాగ్,డిక్షనరీ లను బడులు తెరిచిన తొలిరోజే విద్యార్థులకు అందజేయడం చారితాత్మకమని చెప్పారు.గత ప్రభుత్వంలో స్కూల్స్ తెరిచి 6-7 నెలలైనప్పటికీ యూనిఫాంలో సంగతి దేవుడెరుగు కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి ఉండేదని గుర్తు చేశారు.జగనన్న ప్రభుత్వం ఏర్పడ్డాక నాలుగేళ్లలో విద్య వ్యవస్థపై ఖర్చు చేసిన వ్యయం రూ.60,329.42 కోట్లని తెలిపారు.జగనన్న ప్రభుత్వంలో చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సంపాదించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు,ఎంపీటీసీలు,ఎంపీపీలు,వైస్సార్ కాంగ్రెస్ పార్టీనాయకులు,ఉపాధ్యాయులు,విద్యార్థిని,విద్యార్థులు,వారి తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS