నేడు 11 బీసీ సంఘాలకు పట్టాలు
హైదరాబాద్: రాష్ట్రంలో 11 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కేటాయించిన స్థల పత్రాలను గురువారం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అందజేయనున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 41 బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కోకాపేట, ఉప్పల్ భగాయత్‌లో వేల కోట్ల విలువైన 87.3 ఎకరాల భూమిని కేటాయించింది. భవన నిర్మాణాలకు రూ.95.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఏక సంఘాలుగా ఏర్పడిన 24 బీసీ కుల సంఘాలకు స్థల కేటాయింపు పట్టాలను ఇప్పటికే అందించారు. మరో 11 సంఘాలు సైతం ఇటీవల ఏకసంఘాలుగా ఏర్పాటయ్యాయి. వాటికి మంత్రి గంగుల పట్టాలు ఇవ్వనున్నారు.