కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని,,,,,,,,
యువతరం ఆగస్టు 22 ( వీణవంక మండలం ),,,
అంగిడి కుమార్
PDSU ఉమ్మడి కరీంనగర్ జిల్లఅధ్యక్షులు
రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఈ సందర్భంగా మాట్లాడుతూ
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందించాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్ మెంట్ 5500 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెల్లగాటమాడుతుందన్నారు. విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా వారిని ఉన్నత శిఖరాలకు అందిస్తామని వారి యొక్క ఉన్నతమైన ఆశయాలు నెరవేరుస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది తీరా తెలంగాణ రాష్ట్ర ఏర్పడి పది సంవత్సరాలు గడిచిపోయిన ఇప్పటికీ విద్యార్థుల జీవితాలు అగమఘోచరంగా ఉన్నాయని అన్నారు
రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యలో భాగంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి గురుకుల పాఠశాలను ఆరాకోర వసతులతో సొంత భవనాలు లేకుండా ప్రారంభించడం సరైనది కాదన్నారు. ఎన్నో సమస్యలతో గురుకుల పాఠశాలలో సతమతమవుతుంటే వాటిని పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు అడుగుతుంటే విద్యార్థి సంఘాలను మీడియాను విద్యాసంస్థలలోకి ఆహ్వానించొద్దని చెప్పడం అంటేనే ఆ సమస్యలను కప్పిపుల్చడమే అని అన్నారు కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి సంఘాల పైన మీడియా పైన అకస్తు కక్కుతూ ఆహ్వానించొద్దని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు
వీణవంక మండల కేంద్రానికి కేటాయించిన మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను హుజూరాబాద్ నుండి వీణవంకమండల కేంద్రానికి తరలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాముఈ ప్రకటన పేపర్ లకే పరిమితమై విద్యార్థుల ఆశయాలపై నీళ్లు పోస్తూ కాలయాపన చేస్తుందన్నారు చేస్తుందన్నారు
ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన అందిస్తామని తెలంగాణ వచ్చిన సందర్భంలో ప్రకటన చేశారు నేటికీ ఏ ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయడం లేదు కనీసం ఆ జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు, మరుగుదొడ్లు, లైబ్రరీ, తరగతి గదులు ప్రయోగశాల,లు ఏర్పాటు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరికీ ఉచితంగా బస్సు పాసు విద్యార్థుల సంఖ్య కనుగొనంగా బస్సులను నడుపుతామని విద్యార్థులకు ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని ఇచ్చిన హామీలు తుంగలో తొక్కడం జరిగింది కాబట్టి వెంటనే ప్రతి గ్రామానికి విద్యార్థుల సంఖ్య కనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడపాలని అన్నారు.
కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతున్న ఎస్ ఎం ఎచ్ హాస్టల్స్ కు ఇప్పటివరకు సొంత భవనాలు ఏర్పాటు చేయకుండా పాడుబడ్డ బంగ్లాలలో హాస్టల్స్ ను కొనసాగిస్తున్నారు అవన్నీ ఇరుకు గదులుగా ఉండడం వల్ల విద్యార్థులు ఒక రూమ్ లో ఉండాల్సిన సంఖ్య కంటే అదనంగా ఉండడం వల్ల విద్యార్థులు అనేక రోగాల బారిన పడి విద్య అనేది కొనసాగించలేకపోతున్నారు అక్కడ కూడా విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలో మంచినీటి సౌకర్యము, నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందడం లేదని అన్నారు
వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని లేనియెడల మా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని డిమాండ్ చేశారు
అనంతరం వీణవంక మండల్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది వీణవంక మండల్ అధ్యక్ష కార్యదర్శులుగా అంగిడి దేవేందర్ అరుణ్ ఉపాధ్యక్షులుగా డి ధనుష్ సహాయ కార్యదర్శిగా వేణు కోశాధికారిగా విష్ణువర్ధన్ మండల కమిటీ సభ్యులుగా హరీష్ అభిలాష్ హర్షిత్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.