SAKSHITHA NEWS

తుడా వై.యస్.ఆర్.కూడలి వద్ద ప్రజా సంకల్ప పాదయాత్ర ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉదయం భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ శ్రేణులు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలభిషేకం చేసిన తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష,ఉప మేయర్ ముద్ర నారాయణ, వై.యస్‌.ఆర్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి.

ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ భారతదేశం లో మరే రాజకీయ నేతలు చేయని విధంగా వై.యస్.జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మహా పాద యాత్ర 341రోజుల పాటు 3,648 కిలో మీటర్ల దూరం కొనసాగిన సుధీర్ఘ పాదయాత్ర చేసినారని తెలిపారు.


రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను నేరుగా కలుసుకుని, వారి కష్ట సుఖాలను తెలుసుకున్న ప్రజా నాయకుడు జగనన్న,ప్రజా సంకల్ప యాత్రలో తన దృష్టి కి వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారించాడానికే ఎన్నికల మేనిఫెస్టో లో నవరత్న పథకాలకు జగనన్న చేరార్చారని తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరు క్షణం నుంచే సంక్షేమ పథకాలను అందజేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత జగనన్నదే అని అన్నారు. జగనన్నకు ప్రజల్లో చెక్కుచెదరని ఆదరణ లభిస్తుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లోను మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుతున్నారని తెలియజేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, తిరుపతి శాసనసభ్యుల భూమన కరుణాకర రెడ్డి, నగర పాలక ఉప మేయర్ భూమన అభినయ్ ఆధ్వర్యంలో తిరుపతి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు అన్నారు. నరగంలో మాస్టర్ ప్లాన్, ఫ్రీ లెఫ్ట్ లు,నిర్మాణాలను భూమన అభినయ్ కృషి పలితమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్ర రెడ్డి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, శేఖర్ రెడ్డి, నారాయణ, ముని రామిరెడ్డి, పొన్నాల చంద్ర, నరసింహ చారి, నరేంద్ర ,ఆరణి సంధ్య, శ్రీదేవి, వైయస్సార్సీపి నాయకులు రాజేంద్ర, శివకుమార్, బాలసుబ్రమణ్యం, భరణి యాదవ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 06 At 3.36.59 Pm

SAKSHITHA NEWS