సాక్షితతిరుపతి : పన్ను వసూళ్ళలో, చాలా కాలంగా బకాయి వున్న పన్నులు వసూళ్ళు చేయడంలో రాష్ట్రంలోనే తిరుపతి మొదటి స్థానంలో నిలవడం జరిగిందని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి తెలియజేస్తూ రెవెన్యూ అధికారులను ప్రసంసించారు. తిరుపతి నగరంలోని 68,913 ఆస్తులకు సంబందించి రావల్సిన పన్నులు, బకాయిలు 65,92,72,936 రూపాయలు రావల్సి వుండగా 63,26,88,793 రూపాయాలను 96 శాతంతో వసూళ్ళు చేసి రాష్ట్రంలోనే తిరుపతి మొదటి స్థానం రావడం జరిగిందన్నారు. పన్ను వసూళ్ళకు కృషి చేసిన తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిసి చంధ్రమౌళీశ్వర్ రెడ్డి, రెవెన్యూ అధికారి కె.ఎల్.వర్మాను, రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు రాజశేఖర్, శంకరయ్య, శ్రీనివాసులు రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సూరిబాబు, మధుసూధన్ రెడ్డి, ప్రకాష్, నవీన్, జ్యోతీష్ రెడ్డిలను సోమవారం స్పందనలో ప్రత్యేకంగా మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణలు అభినందించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, రెవెన్యూ అధికారి కె.ఎల్.వర్మా మాట్లాడుతూ పెద్దల సూచనలతో తమ ఆర్.ఐ.ల తోడ్పాటుతో నగరంలోని 102 సచివాలయ అడ్మిన్లు, ఇతర సెక్రటరీల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పన్నులపై వడ్డి మాఫి చేసిన విషయాన్ని ప్రతి ఒక్క ఆస్తిదారులు, బకాయిదారుల వద్దకు వెల్లి వివరించి వసూళ్ళు చేయడం జరిగిందన్నారు.*