వాటర్ ప్లస్, 5 స్టార్ రేటింగ్స్ ర్యాంకులో సర్టిఫికేషన్
స్వచ్చ సర్వేక్షణ్ 2023 లో తిరుపతి నగరపాలక సంస్థ అవార్డుల మోత మోగించింది. పదిలక్షల జనాభా కలిగిన పట్టణాల్లో రెండవ ర్యాంకు, జాతీయ స్థాయిలో క్లీనేస్ట్ సిటీ గా తిరుపతి నగరపాలక సంస్థ కు జాతీయ స్థాయిలో 8వ ర్యాంక్ సాధించింది. మరోమారు వాటర్ ప్లస్ సిటీ గాను, గార్బేజ్ ఫ్రీ సిటీ గా కూడా సర్టిఫికేషన్ కూడా పొందడం జరిగింది.
న్యూడిల్లీలోని భారత్ మండపంలో జరిగిన 2023 స్వచ్చ సర్వేక్షణ్ ఫంక్షన్ లో.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి హర్ దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా ఈ అవార్డులను నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష , కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అధికారులు అందుకున్నారు.
ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ , డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ టిటిడి చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు అభినయ రెడ్డి, కార్పొరేటర్ల సూచనలు, నగర ప్రజలు, ప్రజారోగ్య కార్మికులు, అధికారులు సమిష్టి కృషి, సహకారంతోనే జాతీయ స్థాయిలో ఈ అవార్డులు దక్కాయని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ స్వచ్చ సర్వేక్షణ్ 2023 లో అవార్డులు సాధించడం పట్ల పలువురు కార్పొరేటర్లు, అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళి శ్వర్ రెడ్డి, డి.ఈ. విజయకుమార్ రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.
…………