ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకి సంబందించిన సన్నాహాక సమావేశం నేడు నెల్లూరు కస్తూరిభా పాఠశాల ఆవరణంలోని రవీంద్రనాధ్ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళితులందరూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని అందుకు కారణం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా రాజకీయ పదవులలో ప్రాధాన్యం లాంటి ఎన్నో మేళ్లను పొందడమే కారణమని అన్నారు.
విద్య, వైద్యం, ఉపాధి లాంటి ఎన్నో కార్యక్రమాలు నేడు కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అమలవుతున్నాయని ఇవి ఇలాగే కొనసాగాలి అంటే మరో సారి జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసారు.
దళితులకి సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యమని బస్సు యాత్ర ద్వారా మనకు జరిగిన మేళ్ళన్ని ప్రజలకి వివరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అందరం కలిసికట్టుగా పని చేయవలసిన సమయం ఆసన్నమైనదని సభా వేదికగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, వెలగపల్లి వరప్రసాద రావు, ఎమ్మెల్సీ మేరుగ మురళి, బల్లి కళ్యాణ్, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ, షెడ్యూల్ కులాల కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.