నగరంలో రోడ్లను ఆధునికరిస్తున్నాము – మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్
*సాక్షిత : * తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అంతర్గత మార్గాలన్నింటిని ఆధునికరించి నూతన సిసి, బిటి రోడ్లుగా ప్రారంభిస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. తిరుపతి నగరంలోని తాతానగర్లో సిసి రోడ్ఢును, కాలువలను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవళ్ళిక రెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ తాతానగర్లో గంగమ్మగుడి కూడలి నుండి ప్రశాంత్ స్కూల్ వరకు సిసి రోడ్డును, పెద్ద కాలువను 67.20 లక్షల వ్యయంతో నిర్మించి, నేడు ప్రారంభించడం జరిగిందన్నారు. తిరుపతి పట్టణంలో పాడైపోయిన రహదారులను, ప్రాధాన్యతా క్రమంలో ఆధునికరించడం, అదేవిధంగా అవసరమైన చోట్ల నూతన రహదారులు నిర్మించేందుకు తగు చర్యలు తీసుకుంట్టున్నామని, త్వరలో మరికొన్ని రహదారులను ప్రారంభించడం జరుగుతుందని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఈ మోహన్, ఎంఈ చంద్రశేఖర్, డిఈ దేవిక, నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి, జల్లి తులసీ యాదవ్, ఇతమాకుల సురేష్ యాదవ్, చింతా భరణి యాదవ్, చింతా రమేష్ యాదవ్, రిటైర్డ్ ఏ.ఎస్.పి దేవదానం, రిటైర్డ్ డి.ఎస్.పి నంజుండప్ప, వెంకటేష్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.