తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి, మేయర్ శిరీషాలతో కలిసి వినాయక్సాగర్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి.
సాక్షిత : స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారో అడిగి తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేసారు. నగర ప్రజా జీవనానికి ఎలాంటి ఆటంకం కలుగకుండా ట్రాఫిక్ ని నియంత్రించాలని పోలీసు శాఖ వారికి సూచించారు. ఏర్పాట్లను త్వరిత గతిన పూర్తి చేయాలనీ మునిసిపల్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ శిరీషా, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, నగర కమిషనర్ అంజలి అనుపమ, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ పలువురు కార్పొరేటర్లు మరియు మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.