SAKSHITHA NEWS

ఈ ఫార్ములా రేస్ కేసు విచారణలో హైడ్రామా?

హైదరాబాద్:
ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం హైడ్రా చోటు చేసుకుంది. ఈ కేసు లో విచారణకు రావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు.

దీంతో సోమవారం తన లాయర్ తో కలిసి కేటీఆర్ విచారణకు హాజరయ్యేం దుకు ఏసీబీ ప్రధాన కార్యా లయం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో కేటీఆర్ కార్లను కార్యాలయం గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేవలం మీరు మాత్రమే వెళ్లాలని, మీ లాయర్ కు లోపలికి అనుమతిలేదని పోలీసులు తెలియజేశారు.

దీంతో పోలీసులకు, కేటీఆర్ కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కేటీఆర్ ఉన్నతాధికారులతో ఈ విషయంపై మాట్లాడారు. లాయర్ కు అనుమతి లేదని చెప్పడంతో కొద్దిసేపు అక్కడే వేచిఉన్న కేటీఆర్ ఏసీబీ కార్యాలయం ఎదుట నుంచి విచారణకు హాజరు కాకుండా వెనక్కు తిరిగి వెళ్లిపోయారు

ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చిన కేటీఆర్ విచారణకు హాజరుకాకుండా వెనుదిరిగి పోవడంపై ఏసీబీ అధికారు లు స్పందించారు. న్యాయ వాదులను తీసుకువచ్చి కేటీఆర్ హైడ్రామా క్రియేట్ చేశారని అన్నారు. ఏసీబీ విచారణ తప్పించుకోవ డానికి న్యాయవాదులను తీసుకొచ్చారని, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించా రని అన్నారు.

దర్యాప్తునకు సహకరించా లని హైకోర్టు చెప్పినా కేటీ ఆర్ ఖాతరు చేయలేదని, న్యాయస్థానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామ న్నారు. అయితే, ఏసీబీ అధికారులు కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చేం దుకు సిద్ధమయ్యారు.

సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం కేటీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


SAKSHITHA NEWS