
చిలకలూరిపేట రూరల్ పరిధిలోని యూ.టీ జంక్షన్ దగ్గర షుమారు 9గంటల సమయంలో జరిగిన ప్రమాదం లో మార్కాపురం నకు చెందిన స్కూల్ బస్ ముందు టైర్ కమ్మన కట్టు విరగడం వలన స్కూల్ బస్సు కుడివైపుకు వెళ్లి పక్కకు పడటం వల్ల బస్సులో ట్రావెల్ చేస్తున్న వారిలో ఒకరికి చిన్న చిన్న గాయాలు అయినా వారిని అంబులెన్సు లో హాస్పటల్ కి పంపించారు. చిలకలూరిపేట రూరల్ పి.ఎస్ ఎస్సై విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటన స్థలానకి చేరుకొని గాయాలు అయినా వారిని అంబులెన్సు లో హాస్పటల్ పంపించారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు.
