చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అడ్వైజర్ డిపి యేసయ్య
ప్రకాశం జిల్లాపెద్దదోర్నాల లో
సువార్తికులు సమాజంలో ఆధ్యాత్మిక భక్తి భావాలను పెంచడంతోపాటు సేవ భావం కలిగి ఉండాలని పెద్ద దోర్నాల చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అడ్వైజర్ డిపి యేసయ్య అన్నారు
మండల క్రిస్టియన్ ఇవాంజలిస్ట్స్ పాస్టర్స్ వెల్ఫేర్ సొసైటీ యూనియన్ సమావేశం అధ్యక్షుడు బొప్పూరి. ప్రభుదాస్ అధ్యక్షతన పెద్ద దోర్నాలలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అడ్వైజర్ డిపి యేసయ్య మాట్లాడుతూ సువార్తప్రకటించడం సువార్తకుని బాధ్యతఅయిఉన్నది. అదే క్రమంలో సేవా భావము కలిగి సమాజంలోని దీనులను ఆర్తులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని, ప్రతి సువార్తికుడు సేవాభావముతో పనిచేయాలన్నారు. పాస్టర్ల సంఘం మండల అధ్యక్షుడు తంగిరాల యాకోబు మాట్లాడుతూ సువార్తికుడు ఆదర్శంగా ఉండాలని ఎక్కడ పని చేయుచున్నారో అక్కడే జీతం పుచ్చుకోవాలని మరోచోట జీతాలు తీసుకోవడం అంటే సంఘాన్ని, సమాజాన్ని మోసం చేసినట్లు అవుతుందన్నారు. సువార్తికుడు పాస్టర్ దర్శనం యోబు మాట్లాడుతూ యేసు మాటలను విశ్వసించిన శిష్యులు విస్తారమైన చేపలు పట్టిన నమ్మకాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో సువార్తికులు డి. యోహాను, గౌతమ్ చిన్న ఎల్లయ్య, వై ఇమ్మానుయేలు, టీ ఏసురత్నం, పూర్ణకంటి జాషువా, సింగ ఆవులయ్య , ఎడవల్లి సింగ యేసయ్య ,మాండ్ల వెంకటేశ్వర్లు( యోహాను) ఎలకపాటి చినబాబు, మోజేష్, పూర్ణ కంటి యాకోబు, తంగిరాల సురేష్, బాల యేసు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు
ఆధ్యాత్మిక భక్తి భావాలను పెంచడంతోపాటు సేవాభావం కలిగి ఉండాలి
Related Posts
ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం
SAKSHITHA NEWS ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదంAP: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధుకు గత ప్రభుత్వం విశాఖ జిల్లాలో కేటాయించిన రెండు ఎకరాల స్థలం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ (1984) అనిల్ చంద్ర పునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. SAKSHITHA NEWS