SAKSHITHA NEWS

శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామి
సంతోషిమాత దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మానసా దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన స్వామీజీ


సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ప్రపంచంలో మానసిక ప్రశాంతతకు మించినది మరొకటి లేదని పుష్పగిరి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకరాచార్య మహాస్వామిజి తెలిపారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మానస దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులనుద్దేశించి మాట్లాడారు. పరమశివుడు ఒకానొక సమయంలో వైరాగ్యంతో ఉంటూ ఒకేసారి అమితానందాన్ని పొందడంతో మానసా దేవి ఉద్భవించిందని తెలిపారు. మనిషిలో ఆర్థిక ఆరోగ్య ఉద్యోగ ఎన్ని రంగాల్లోనైనా తృప్తిగా ఉన్న మానసిక ప్రశాంతత లేకపోతే ఆ జీవితానికి మనుగడ లేదన్నారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతలను అలవర్చుకోవాలన్నారు. కలియుగంలో నామస్మరణతోనే మోక్షం కలుగుతుందని తెలిపారు. దేవాలయాలు అభివృద్ధి చెందాలంటే భజన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మరింత అభివృద్ధి చేసి భక్తులు అధికంగా వచ్చే విధంగా కృషి చేయాలని కమిటీ వారికి తెలిపారు. ఇంతకుముందు స్వామీజీని దేవాలయ ప్రధాన అర్చకులు శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పురస్కరించుకొని అమ్మవారికి నూతన ఫస్ట్ వస్త్రములు అలంకరింపజేసి


ఉద్యాపన వ్రతం, మహిళలచే ఒడిబియ్యం, మంగళ హారతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పరిపాలిత దేవాలయాల ధర్మాధికారి ఎంఎల్ఆర్ గుప్తా, శ్రీ సంతోషిమాత దేవాలయం అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్త బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామమూర్తి, కమిటీ సభ్యులు నరేంద్రుని విద్యాసాగర్ రావు, భేలిదే అశోక్ , పబ్బ ప్రకాశ రావు, కొత్త మల్లికార్జున్, తాళ్లపల్లి రామయ్య నామిరెడ్డి పాపిరెడ్డి దేవరశెట్టి సోమయ్య ముదిరెడ్డి లింగారెడ్డి, గోపారపు రాజు, బ్రాహ్మ0డ్లపల్లి దేవి దత్తు, బోనగిరి విజయకుమార్, నూక రవి శంకర్ ,శివ ప్రసాద్ , జగదీశ్వరి,దేవాలయ అర్చకులు ఇరువ0ట్టి శివరామకృష్ణ శర్మ, భట్టారం వంశికృష్ణ శర్మ, థరూరి కృష్ణమాచార్యులు, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తది తరులు పాల్గొన్నారు…

WhatsApp Image 2024 04 26 at 5.34.42 PM

SAKSHITHA NEWS