SAKSHITHA NEWS

సాక్షిత : నగర మేయర్ శిరీష, కమిషనర్ హరిత, అధికారులతో కలిసి పరిశీలన
నగర పాలక
సమయం లేదు మిత్రమా ఏప్రిల్ 30వ తేదీ లోపల తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రోడ్డును శరవేగంగా పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.
తాతయ్య గుంట మాస్టర్ ప్లాన్ రోడ్డును గాంధీ విగ్రహం కూడలి నుండి తుడా ఆఫీస్ వరకు తిరుపతి నగర మేయర్ శ్రీమతి డాక్టర్ శిరీష, కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్, ఉప మేయర్ ముద్ర నారాయణ, అధికారులతో కలిసి ఉదయం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తిరుపతి గంగ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని,
అందులో భాగంగా గంగమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రోడ్డును వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో శరవేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.

మేయర్ శ్రీమతి డాక్టర్ శిరీష, కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ మాట్లాడుతూ తాతయ్య గుంట మాస్టర్ ప్లాన్ రోడ్డును ప్రజలకి ఇబ్బంది కలక్కుండా నాణ్యతతో శరవేగంతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు.
మాస్టర్ ప్లాన్లు రోడ్లను పరిశీలించే వారిలో మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డివిజన్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం,డి.ఈ. దేవిక, అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS