ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు

Spread the love

పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవాలి
ఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలి
-ఎంపీ నామ
రైతు సమస్యలపై నామ నేతృత్వంలో కలెక్టర్ గౌతమ్ కు వినతి పత్రం అందజేసిన బీఆర్ ఎస్ ప్రతినిధి బృందం
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ప్రజలు , రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, పంట నష్టపోయిన రైతులకు సత్వరమే ఎకరాకు 25 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని , ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అదనంగా ఇస్తానన్న 500 రూపాయలు బోనస్ ను తక్షణమే ఇవ్వాలని, మంచినీటి ఎద్దడి లేకుండా సమస్యను పరిష్కరించాలని తదితర సమస్యల పరిష్కారం కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గౌతమ్ ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు .ఈ సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తాగు , సాగునీటి ఎద్దడితో ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారని గతంలో ఎన్నడూ లేని దుస్థితి నేడు దాపురించిందని అన్నారు .సమస్యను పరిష్కరించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఎంతటి పోరాటానికి అయినా సిద్ధమని నామ స్పష్టం చేశారు

సాగునీరందక చేతికి వచ్చిన పంట ఎండిపోయిందని, వరి , మొక్కజొన్నకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని , ప్రభుత్వం వెంటనే సర్వే చేసి ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి వెంటనే రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రతి ఎకరాకు రూ.25 000 చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు .బీఆర్ఎస్ ప్రతినిధి బృందం జిల్లా వ్యాప్తంగా పర్యటించి వరి, మొక్కజొన్న తదితర పంటలు బాగా నష్టపోయినట్లు అంచనా వేయడం జరిగిందని చెప్పారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగిందని సత్వరమే రైతులకు పరిహారం చెల్లించే విషయంలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరినట్టు ఈ సందర్భంగా నామ వెల్లడించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , పార్టీ జిల్లా అధ్యక్షులు ,ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు , పార్టీ నాయకులు కొండబాల కోటేశ్వరావు , మదన్ లాల్, బెల్లం వేణు ,బాణాల వెంకటేశ్వరరావు, చింతకాని మండల పార్టీ అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, కార్యదర్శి వెంకట రామారావు, జడ్పిటిసి తిరుపతి కిషోర్, వైస్ ఎంపీపీ హనుమంతరావు , మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంకాయలపాటి లచ్చయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులు మంకెనరమేష్ , రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రత్నాకర్ ,సర్పంచుల సంఘం నుంచి అధ్యక్షులు కన్నేబోయిన కుటుంబరావు , మండల నాయకులు నూతలపాటి వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
……………..

Related Posts

You cannot copy content of this page