There is no one who cares about the loss of life
ప్రాణాలు పోతున్న పట్టించుకున్న నాధుడే లేడు
సాక్షిత ప్రతినిధి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండల కేంద్రంలో హై వే రోడ్ పై వెలగని లైట్లు, ప్రమాదాలకు గురవుతూ ఎందరో చనిపోతున్న పట్టించుకోని ప్రజా ప్రతినిధులు.అధికారులు. చెన్నమ్మ వైఫ్ ఆఫ్ శీను. కోనాపూర్ గ్రామం.జనవరి ఒకటి రాత్రి 8 గంటలకు వెల్దండ కేంద్రంలోని డ్రాగన్ ఫుడ్ ముందు కార్ ఢీకొనడంతో అక్కడికి అక్కడే మరణించడం జరిగింది. లైట్లు లేనందున కెమెరా లో కార్ సక్రమంగా పడలేదు.
యాక్సిడెంట్ చేసిన కారు దొరకలేదు. ఈ విధంగా హైవేపై ఉన్న వీధిలైట్లు వెయ్యకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులు,వాహనదారులు. ప్రాణాలు పోతున్న వెల్దండ గ్రామపంచాయతీలో నిధులులేవంటున్న వెల్దండ గ్రామపంచాయతీ.ప్రమాదాలు జరుగుతున్నాయి దాతలు సహాయం చేయండి అంటున్న వెల్దండ ప్రజలు.
వెల్దండ మండల కేంద్రం లోని ఉన్నటువంటి హై వే (జాతీయ రహదారి వెల్దండ ఇటు హైదరాబాద్ వరకు జిఎంఆర్ సంస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం రోడ్ విస్తరణ 4 లైన్ల రోడ్ గా వేయడంతో పాటు,హై వే రోడ్ కి ఆనుకొనిఉన్నఊర్లకిడివైడర్.కి మధ్యలస్తంబాలకు హైలోజన్ లైట్స్ రాత్రి వేళల్లో వెలుగు కొరకు వేయడమైనది.కానీ సుమారు ఒక నెల రోజుల నుండి ఈస్తంబాలను మరియు వాటికి ఉన్న వెలగని లైట్లనుచూసిమురుసుకోవడమే* *తప్ప, లైట్లు మాత్రం వెలగడం లేదు. దీని పై సంబంధితఅధికారులుపట్టించుకోకపోవడంతో ,ఈ రహదారి కాస్త ప్రమాదాలకు నిలయాలవుతున్న తీరు.
జిఎంఆర్ సంస్థ కూడా పట్టించుకోకపోవడం వలన వారికి నెల రోజులుగా కరెంట్ చార్జీల బిల్ మిగిలించుకున్న పరిస్థితి. వాహనదారుల వద్ద టోల్ చార్జీలు మాత్రం ఖచ్చితంగా వసూలు చేస్తారు.
కానీ ప్రజలకు, వాహనదారులకు ,ప్రయాణికులకు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో జిఎంఆర్ సంస్థ వారు పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న తీరు .కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు గాని ,జిల్లా కలెక్టర్ స్పందించి హైవే పై లైట్స్ వెలిగేలా చర్యలు తీసుకోవాలనిస్థానికులు,వాహనదారులు,ప్రయాణికులు, వెల్దండ ప్రజలు కోరుచున్నారు.ఇప్పటికైనా ఈ విషయం పై అధికారులు జిల్లా కలెక్టర్ స్పందిస్తారో ?లేదో వేచి చూద్దాం మరి.