SAKSHITHA NEWS

Divorce: ఆర్నెళ్లు ఆగాల్సిన అవసరం లేదు.. ఆర్టికల్ 142 ప్రకారం వెంటనే విడాకులు: సుప్రీంకోర్టు

Divorce: ఆర్టికల్ 142 ప్రకారం తక్షణమే విడాకులు ఇవ్వవొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. విడాకుల కోసం ఆర్నెళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది..

అయిదుగురు సభ్యుల బెంచ్ ఓ కేసులో కీలక తీర్పును ఇచ్చింది..

న్యూఢిల్లీ: విడాకులపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. విడాకులు(Divorce) కోరుకునే జంట ఆర్నెళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. కలిసి జీవించలేని పరిస్థితులు ఉన్నప్పుడు.. ఆర్టికల్ 142 ప్రకారం తన అధికారాలను ఉపయోగించుకుని.. దంపతులకు విడాకులు ఇవ్వవొచ్చు అని సుప్రీం కోర్టు చెప్పింది. దంపతులు ఇద్దరూ విడాకులకు అంగీకరిస్తే, హిందూ వివాహ చట్టం ప్రకారం ఆర్నెళ్లు ఆగాల్సిన అవసరం లేదని కోర్టు వెల్లడించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌, సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్ ఓకా, విక్రమ్ నాథ్‌, జేకే మహేశ్వరిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో తీర్పును వెలువరించింది..


SAKSHITHA NEWS