పేదల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం….
మత సమరస్యానికి ప్రతీకగా సీఎం కేసీఆర్ పాలన…
పేద ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేసిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ….
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి….
సాక్షిత : రాష్ట్రంలో పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ పండుగలను ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రంజాన్ కానుకల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేశారు*.
అనంతరం యాలాల్ మండల్, పెద్దేముల్ మండల్, కోట్ పల్లి మండల్ కి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులని పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో పలు మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముస్లిం మత పెద్దలు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు……