బస్ డిపో,మెడికల్ కాలేజ్ సాదించేంతవరకు పోరాటం కొనసాగుతుంది.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
సాక్షిత : హెచ్ఏంటీ ఖాళీ స్థలంలో బస్ డిపో,మెడికల్ కాలేజ్ ఏర్పాటు కొరకు,రహదారుల విస్తరణ కొరకు సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్ష నేటికి మూడవ రోజు చేరిన సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ పాల్గొని మాట్లాడటం జరిగింది.
ఈ కార్యక్రమానికి శాఖ కార్యదర్శి సహదేవ్ రెడ్డి అధ్యక్షత వహించగా దీక్షలో బాబు,రాములు,సోమయ్య, ఆశయ్య లు కూర్చోగా వారికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఐ నిర్వహిస్తున్న పోరాటం వల్ల జగతగిరిగుట్ట ప్రజలు, నియోజకవర్గ ప్రజల్లో కూడా మంచి స్పందన వచ్చిందని, పలువురు అభినందనలు తెల్పటంతో పాటు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి సాధించించుకోవలని చూపుతున్నారని అన్నారు. దీనికి అన్ని వర్గాల వారు హర్షిస్తుంన్నారని కావున పై డిమాండ్లను సాదించేంత వరకు ఉద్యమాన్ని అనేక పోరాట రూపాల్లో కొనసాగిస్తామని, సీపీఐ చేసే పోరాటం ఎన్నికల్లో గెలవడానికోసం కాదని ప్రజల కోసమని కావున ప్రజల కోసమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ నాయకులు వెంకటేష్, మునిసిపల్ అధ్యక్షుడు రాములు,ఏఐవైఎఫ్ నాయకులు రాజు, బాబు, సామెల్, ఇమామ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.