సిపిఎస్ రద్దు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.. తపస్… రాష్ట్రంలో కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జగిత్యాల జిల్లా శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేసింది ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియ జేసిన అనంతరం సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ అయిన సిపిఎస్ రద్దు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని… ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సిపిఎస్ రద్దుకు హామీ ఇచ్చినమేరకు వెంటనే రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని వారు కోరారు. పాత పెన్షన్ విధానం మాత్రమే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆమోద యోగ్యంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య బోయినపల్లి ప్రసాదరావు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అయిల్నేని నరేందర్రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు vodnala రాజశేఖర్ జిల్లా బాధ్యులు మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
సిపిఎస్ రద్దు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.. తపస్
Related Posts
ఎంజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తోటపల్లి నాగరాజు.
SAKSHITHA NEWS సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణానికి చెందిన తోటపల్లి నాగరాజును మాదిగ జర్నలిస్టుల ఫోరం(ఎం జె ఎఫ్)జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూన్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు గాదె రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదే…
చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం.
SAKSHITHA NEWS చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం. సాక్షిత ప్రతినిధి చిలుకూరు సూర్యపేట జిల్లా, :సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం చిలుకూరు గ్రామంలోని నేషనల్ హైవే 167 కోదాడ టు హుజూర్నగర్ రోడ్డు లో కటకమ్మ గూడెం…