అందరి గుండెల్లో పాటను ‘నాటు’కుంటూ పోయారు

Spread the love

త్రిబుల్ ఆర్ కి ఆస్కార్ రావడం పట్ల పొంగులేటి హర్షం

అందరి గుండెల్లో పాటను ‘నాటు’కుంటూ పోయారు

త్రిబుల్ ఆర్ కి ఆస్కార్ రావడం పట్ల పొంగులేటి హర్షం
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

అందరి గుండెల్లో పాటను ‘నాటు’ కుంటూ పోయి… తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచమంతా గర్వించే స్థాయికి తీసుకువెళ్లి ఆస్కార్ అవార్డుకు అర్హత సాధించిన త్రిబుల్ ఆర్ సినిమా టీం కి ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గేయ రచయిత సుభాష్ చంద్రబోస్ అద్భుతమైన పాట రాయగా దానికి చక్కని సంగీతం సమకూర్చిన ఎం.ఎం. కీరవాణి, స్వరకల్పన చేసిన రాహుల్ సిప్లిగుంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్గా వ్యవహరించిన ప్రేమ్ రక్షిత్ ల కృషి అభినందనీయమన్నారు.

ఇంతటి చారిత్రత్మక నేపథ్యం కలిగిన గొప్ప సినిమాకు దర్శకత్వం వహించిన ఎస్.ఎస్ రాజమౌళి, కథనాయకులుగా వ్యవహరించి వారి అభినయంతో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కించుకున్న హీరోలు నందమూరి తారక రామారావు, కొణిదెల రామ్ చరణ్ తేజ్ ప్రతిభ అనన్య సామాన్యమైనదని కొనియాడారు. భవిష్యత్తు రోజుల్లోనూ తెలుగు సినిమా ఖ్యాతి ఇంకా ఉన్నతస్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా పొంగులేటి పేర్కొన్నారు.

తల్లాడలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి

తల్లాడ : ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తల్లాడ మండలంలో సోమవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా తల్లాడ లో నూతనంగా ఏర్పాటు చేసిన వి.ఎస్ జ్యూయలరీ షాప్ ను ప్రారంభించారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

లక్ష్మీదేవిపల్లి మండలంలో పొంగులేటి పర్యటన

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి మండలంలో సోమవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని ఎదురుగడ్డ, హేమచంద్రాపురం, కారుకొండ, తెలగరామవరం, సీతారామపురం, వేపలగడ్డ, లాలు తండా, హమాలీ కాలనీ, చాతకొండ, సాటివారిగూడెం, డ్రైవర్కాలనీ, శ్రీనగర్ కాలనీ తదితర గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో ఇటీవల చనిపోయిన పలువురు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని, వివిధ ప్రమాదాల్లో గాయపడిన కొందరిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సాయాలను అందజేశారు. పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల వివాహం చేసుకున్న పలువురు నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. అదేవిధంగా పలు దేవాలయాలు, చర్చిలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట ఊకంటి గోపాలరావు, తూము చౌదరి, ఆళ్ళ మురళి, చీకటి కార్తీక్, మహ్మద్ గౌస్ పాషా, పూనెం శ్రీనివాస్, తాండ్ర నాగబాబు, ఆయూబ్ ఖాన్, దేవరగట్ల ప్రసాద్, మతిన్, సర్పంచ్ లు బండా వెంకటేశ్వర్లు, చింతా సుజాత, సేవ, శ్రీను, ఎంపీటీసీ భద్రమ్మ, ఉప సర్పంచ్ లు తాటి బాలకృష్ణ, నర్సింహారావు, సత్యనారాయణ రెడ్డి, బాల పాసి, మాధవ్, దుర్గారాశి సతీష్, కలకోటి రాజు, నిరంజన్ రెడ్డి, పండు, రామ్, కిరణ్, అజయ్ తదితరులు ఉన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page