SAKSHITHA NEWS

రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను బెదిరిచ్చేందుకు అందజేసిన షోకాజ్ నోటీసులకు బెదిరేది లేదు – రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచాలి

మైలవరం

ప్రతి షోకాజు నోటీసుకు మైలవరం ప్రాజెక్టు కార్యాలయంలో సమాధాన పత్రాలు అందజేసిన అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు……

గత 38 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సమ్మె చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అస్మా చట్టాన్ని అంగన్వాడీలపై ప్రయోగిస్తూ జీవో నెంబర్ రెండును విడుదల చేసింది అనంతరం షోకాజు నోటీసులు అందజేయడం జరిగింది షోకాజ్ నోటీసులకు దడవని అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు గురువారం స్థానిక సిడిపిఓ కార్యాలయంలో సమాధాన పత్రాలను అందజేశారు


ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శులు సిహెచ్ సుధాకర్ ఎం మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ రాజకీయాలకు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు భయపడరని వారికి సిఐటీయూ మద్దతుగా ఉంటుందని తెలిపారు, స్కీం వర్కర్లుగా పని చేసే వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం సిగ్గుమాలిన చర్యని, షోకాజ్ నోటీసులు ఇచ్చి బెదిరింపులకు దిగటం అత్యంత దుర్మార్గమని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేతనాల పెంపు విషయంలో ఇంత పట్టుగా ఉండటం సమంజసం కాదని ఒక ప్రక్కన అధిక ధరలతో ప్రజలంతా సతమతమవుతూ ఉంటే కనీస వేతనం లేక అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అనారోగ్యాల పాలయ్యే పరిస్థితులు ఉన్నాయని వారు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేయబోతున్నామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జి కొండూరు మండల కార్యదర్శి కే బాలకృష్ణ, మైలవరం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఆర్వి పుష్పకుమారి , సిహెచ్ శారద సెక్టార్ లీడర్స్ బుల్లెమ్మ నిర్మల రెబ్బలు మాణిక్యం విజయలక్ష్మి అరుణ కుమారి సరోజినీ తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2024 01 18 At 4.24.15 Pm

SAKSHITHA NEWS