ఉద్యోగ విరమణ పోందిన పోలీస్‌ అధికారుల సేవలు మరవలేనివి

Spread the love

స్వతంత్ర ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ జార్జ్ ను సన్మానించిన ఎస్పి : – రాహుల్ హెగ్డే ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట

నాలుగు దశాబ్దాల కాలం పాటు పోలీసు శాఖలో విధులు నిర్వహించి నేడు స్వతంత్ర ఉద్యోగ విరమణ (VLC) పోందుతున్న హెడ్ కానిస్టేబుల్ జార్జ్ సేవలు అభినందనీయం అని సూర్యాపేట ఎస్పి తెలిపారు.

జిల్లాలో పోలీస్‌ విభాగంలో సుధీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీవిరమణ జార్జ్ ను ఎస్పి ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేసారు. అనంతరం ఎస్పి మాట్లాడుతూ క్లిష్ట సమయాల్లో తమ కుటుంబాలకు దూరంగా వుంటూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన అలనాటి పోలీస్‌ అధికారులు నేటి తరం పోలీస్‌ అధికారులకు అదర్శంగా నిలుస్తారని, పదవీ విరమణ పోందిన తరువాత కుడా సమాజం నుండి గౌరవాన్ని పోందేవారు కేవలం పోలీస్‌ అధికారులు మాత్రమేనని, పదవీ విరమణ అనంతరం పోలీస్‌ అధికారులు తప్పసరిగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద కనబరచాలని, నిరంతరం వ్యాయము, యోగా సాధన చేయాలని, పదవీవిరమణ అనంతరం ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక లబ్దిని ప్రణాళికబద్దంగా పోదుపు చేసుకోంటూ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఎస్పి తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో అధనపు ఎస్పి నాగేశ్వర రావు, ట్రైనీ ఐపిఎస్ అధికారి రాజేష్ మీనా, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, సిబ్బంది ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page