SAKSHITHA NEWS

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణారావు 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్-2 బస్తీ దవాఖాన వద్ద ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షా కార్యక్రమంలో పాల్గొని కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కంటి పరీక్ష శిబిరంలో ఏమైన సదుపాయాల లోపాలు ఉన్నాయా అని వైద్యులను అడిగి తెలుసుకొని, ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం మరియు అవసరమైన వారికి కళ్ళ అద్దాలను,మందులను అందజేయాలని తెలియజేశారు.మరియు అన్ని రకాల సౌకర్యాలను పెంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని NMC వైద్య సిబ్బందిని ఆదేశించారు. కంటి పరీక్ష వైద్య బృందం అధికారులను శాలువాలతో సత్కరించారు. ఆనంతరం కాలనీలో పర్యటించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు తలారి విరేశ్ , సయ్యద్ సలీమ్ ,NMC బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ పద్మ ప్రసాద్ , 12వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సుబ్బా రెడ్డి , NMC బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు SK ఖాన్ సాబ్ , యూత్ వైస్ ప్రెసిడెంట్ రాము , 12వ డివిజన్ బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ ,జనరల్ సెక్రటరీ బట్ట మురళి , జాయింట్ సెక్రటరీ ఎల్ఐసి శ్రీనివాస్ , యూత్ ప్రెసిడెంట్ కిరణ్ , గాయత్రి గార్డెన్స్ రామ్ కుమార్ ,బాలరాజు , లడ్డు రాజు ,గోల్కొండ శ్రీనివాస్ ,NMC మెడికల్ ఆఫీసర్ అజీజ్ ఖాసీం , NMC శానిటేషన్ ఇంఛార్జి వినోద్ కుమార్ , వైద్య బృందం అధికారులు జ్యోతీ రమణి, అభిషేక్, వనకుమరి, కాలనీ వాసులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS