సమస్య మీది… పరిష్కారం శీనన్నది..

Spread the love

అండగా ఉంటాం… ఆదుకుంటాం…

  • మన యూనియన్ ఆటోడ్రైవర్లందరికీ హెల్త్ కార్డులు ఇస్తాం
  • పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ దయాకర్ రెడ్డి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఆటోడ్రైవర్లకు ఏ కష్టామొచ్చినా… ఏ ఆపదొచ్చినా ఆదుకునేందుకు మన పొంగులేటి శీనన్న ఉన్నారని… ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ దయాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. నగరంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఐ ఎన్ టి యూ సి యూనియన్ నగర అధ్యక్షులు నరాల నరేష్ మోహన్ నాయుడు అధ్యక్షతన ఆటో డ్రైవర్ల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన దయాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జనగర్జనను సఫలీకృతం కాకుండా చేసేందుకు కొంతమంది బీఆర్ఎన్ పార్టీకి చెందిన ఆటో యూనియన్ నాయకులు విఫలయత్నం చేశారన్నారు. సభ సందర్భంగా శీనన్న పై అభిమానంతో ఆటోలకు మైక్ లను కట్టుకుని తిరిగిన ఆటో డ్రైవర్లను వేధింపులకు గురిచేయడాన్ని తానే స్వయంగా గమనించినట్లు తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరగానే ఆటో డ్రైవర్లందరినీ ఏకతాటిపైకి తెచ్చి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి ఆటో అడ్డాలలో కాంగ్రెస్ పార్టీ, శీనన్న సానుభూతి పరులను భయభ్రాంతులకు గురిచేయడం కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఏ ఒక్క ఆటో డ్రైవర్ సోదరుడు కూడా భయపడాల్సిన అవసరం లేదని శీనన్న పక్షాన తామంతా అండగా ఉంటామన్నారు. ప్రస్తుత ఐ ఎన్ టి యూ సి నాయకుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటు అవుతుందని తెలిపారు. మన యూనియన్ లోని ఆటో డ్రైవర్లందరికీ కిమ్స్ హాస్పిటల్ తరుపున 50 శాతం రాయితీతో కూడిన హెల్త్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో యూనియన్ పరమైన లేదా వ్యక్తిగత పరమైన ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యను వెంటనే మన పొంగులేటి శీనన్న దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, దొడ్డా నగేష్ యాదవ్, పల్లెబోయిన చంద్రయ్య యాదవ్, ఓబీసీ నగర అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, ఐ ఎన్ టి యూ సి నగర ప్రధాన కార్యదర్శి సిహెచ్. విప్లవ్ కుమార్, జంగిపల్లి ప్రసాద్, బొల్లిని నాగరాజు యాదవ్, ఎస్.కె. సత్తార్, బొడ్డు సైదులు, వీరయ్య గౌడ్, బాబు, ప్రసాద్, నర్సింహారావు, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page