SAKSHITHA NEWS

సిద్దిపేట

15 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం ( పిడిఎస్ రైస్) ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న వాటిని పట్టుకున్న సిద్దిపేట టాస్క్ఫోర్స్ & గజ్వేల్ పోలీసులు.గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మదిపూర్ గ్రామ శివారులో తోట ప్రవీణ్ తండ్రి బుచ్చయ్య, గ్రామం అహ్మదిపూర్, అతను తన ఆటో నెంబర్ టి ఎస్ 11 యూఏ -2756 గలదానిలో 15 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం.తరలించుచుండగా పట్టుకొని విచారించగా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ రేషన్ బియ్యం తరలిస్తున్నాడని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది గజ్వేల్ పోలీసులు పట్టుకున్నారు. గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.గ్రామాలలో,పట్టణాలలో ఇసుక అక్రమ రవాణా చేసిన, పిడిఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టిన రవాణా గ్యాంబ్లింగ్, పేకాట, మరిఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.


SAKSHITHA NEWS