ఎన్నికల వేళ తోడేళ్ళ గుంపులా ప్రతిపక్షాలు

Spread the love

ప్రశ్నిస్తే సీబీఐ, ఈడి, ఐటీ దాడులు…
దేనికీ బయపడని నాయకుడు సీఎం కేసీఆర్…
ప్రగతి నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ శ్రీ కృష్ణ గార్డెన్స్ లో స్థానిక మేయర్ శ్రీమతి కొలన్ నీలా గోపాల్ రెడ్డి మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ప్రగతి నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంఛార్జి, ఎమ్మెల్సీ డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి , కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.


ఈ సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా వంద శాతం నీటిని ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. గతంలో కరెంటు కోతలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే ఇప్పుడు పూర్తిగా అధిగమించామని.. జనరేటర్ల అవసరమే తెలంగాణలో లేదన్నారు. అణగారిన వర్గాలకు ఏ విధంగా మేలు చేకూర్చాలనే ఆశయంతో కృషి చేసిన అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని అన్నారు. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఇటీవలే ప్రధాని పర్యటనలో అన్నీ మేమే చేశామని చెప్పుకుంటున్నారని, హైదరాబాద్ లో మెట్రో సీఎం కేసీఆర్ కృషితోనే సాధ్యమైందని అన్నారు. ఓఆర్ఆర్ ను అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు.

హైదరాబాద్ నగరంలో అనేక ఫ్లై ఓవర్ లు రాష్ట్ర నిధులతోనే పూర్తి చేసుకున్నామని అన్నారు. రైతులు పండించిన పంటలు కొనుగోలులో కేంద్రం మొండి చేయి చూపుతుందన్నారు. కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం దేశ సంపదను అదానీకి దోచి పెడుతున్నదని, ప్రశ్నిస్తే సీబీఐ, ఈడి, ఐటీ దాడులు చేస్తున్నారని మండి పడ్డారు. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ దేనికీ బయపడరని అన్నారు. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. సంపదను సృష్టిస్తూ అర్హులైన ప్రజలకు అందించే విధంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎన్నికల వేళ తోడేళ్ళ గుంపులా ప్రతిపక్షాలు విమర్శించే ప్రయత్నాలు చేస్తాయని, వాటిని తిప్పి కొట్టేలా బీఆర్ఎస్ శ్రేణులు పని చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా అభివృద్ధి చేసి దేశ రాజకీయాల్లో అడుగుపెట్టిన సీఎం కేసీఆర్ కి మనమంతా మరోసారి సహకారం అందిద్దామని అన్నారు.


ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడం తమ బాధ్యత అన్నారు. కష్టపడిన ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ విమర్శలను తిప్పి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, సుధీర్ రెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్ మరియు కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page