ఈ కోడిగుడ్లు ఏ అంగన్వాడి సెంటర్ వారికి చెందినవి…?
మండల అధికారుల తనిఖీల్లో అంగన్వాడి కేంద్రానికి చెందిన 52 కోడిగుడ్డు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభ్యం…?
చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారం కోడిగుడ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో గురు..!
శ్రీశైల మండలం సాక్షీత ఏప్రిల్: 24: నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామం లోని రింగ్ పార్క్ సమీపంలో శనివారం సాయంత్రం రెవిన్యూ సిబ్బంది మరియు అంగన్వాడి సూపర్వైజర్ తమ సిబ్బందితో హోటల్లు, కిరాణా దుకాణాలు, మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు అయితే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సుమారు 52 అంగన్వాడి కేంద్రానికి చెందిన ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి కోడిగుడ్లు తనిఖీలో భాగంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించాయి అవి ఏ అంగన్వాడి సెంటర్ నిర్వాహకులు వారికి విక్రయించారో ఆ పెరుమాళ్ళకే వేరుక..? వివిధ దినపత్రికలో అంగన్వాడి నిర్వహకులపై మరియు సిబ్బందిపై ఇన్ని వార్తలు వస్తున్నా ఉన్నత అధికారులు ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు అనే సందేహాలు స్థానికంగా ప్రజల్లో నెలకొన్నాయి ఇంత జరుగుతున్న జిల్లా అధికారులు ఎందుకు స్పందించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల లైన బాలింతలు చంటి బిడ్డలు గర్భవతులకు పౌష్టిక ఆహారం అందేలా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అంగన్వాడి సిబ్బందిలకు వేలకు వేలు జీతాలు ఇచ్చి వారికి సక్రమంగా పంచి చిన్నారులకు మంచి ఆరోగ్యంతో పాటు విద్య కూడా నేర్పించేలా టీచర్లను ఆయాలను మండల అధికారులను జిల్లా అధికారులను ఏర్పాటుచేసి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే అధికారులు ఎవరు కూడా సరిగా విధులు పట్ల శ్రద్ధ చూపించడం లేదని స్థానిక ప్రజలు వీరి తీరుపై మండిపడుతున్నారు ఇకమీదటైనా ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని స్థానిక ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు