వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ
ఢిల్లీ: బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల రెండోరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు..
పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని మోదీ అన్నారు. వచ్చే వంద రోజులు ఎంతో కీలకమని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారంతా 18వ లోక్సభ ఎన్నికలకు ఓటు వేయబోతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని మోదీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందని మోదీ తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాసే బీజేపీ లక్ష్యమని ఆయన గుర్తుచేశారు. పార్టీ శ్రేణలు ప్రతి ఇంటికి, ప్రతి ఓటరు వద్దకు చేరుకోవాలని సూచించారు. నవ భారత్ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని పీఎం మోదీ అన్నారు. గత పదేళ్లలో దేశ రూపరేఖలు మారాయని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ భారీ మేజార్టీతో మళ్లీ అధికారంలోకి రాబోతోందని తెలిపారు..
ఈ పదేళ్లలో అవినీతి రహిత పాలన అందించాని.. ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవల్సి ఉందన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని.. దేశమే ముఖ్యమని మోదీ అన్నారు. విపక్ష నేత కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400 స్థానాలు వస్తాయని అంటున్నారని తెలిపారు. దేశంలో ప్రభుత్వాలు మారుతుంటాయి..