
భూ కబ్జాదారుల భరతం పట్టాలి
శాసనసభలో భూ కబ్జాలపై మాట్లాడిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
సాక్షిత వనపర్తి : పెబ్బేరు సంత, వనపర్తి లో దేవాలయ భూములు, అల్లంపూర్ మానవపాడులో కృష్ణానదిని కబ్జా చేసిన కబ్జాదారుల భరతం పట్టేందుకు హైడ్రాను వనపర్తి వైపు పంపించాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి శనివారం శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ని అయన కోరారు
మార్చ్ నెల కావడంతో ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉండే ఇన్కమ్ టాక్స్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ( LRS) ఎల్ఆర్ఎస్ చెల్లింపులను ఏప్రిల్ నెల వరకు పొడిగించాలని కోరారు
హైదరాబాద్ మహానగరంలో ఇచ్చినటువంటి ఓ టి ఎస్ ( OTS) పద్ధతిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు అన్ని మున్సిపాలిటీలకు కూడా వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు
నీటిపారుదలకు సంబంధించి D8, D5, బుద్ధారం రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాలలో చివరి ఆయకట్టు వరకు నీరు చేరడం లేదని దీనిని దృష్టిలో ఉంచుకొని కాలువలలో పేరుకుపోయిన సిల్టును తొలగించాలని ఆయన కోరారు
పెబ్బేరు మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా మారుస్తూ మరికొన్ని కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన పేర్కొన్నారు
వనపర్తి నియోజకవర్గం లో బైపాస్ రోడ్డుకు, ఖాన్ చెరువు కెనాల్ నిర్మాణాలకు సంబంధించి అటవీశాఖ అనుమతుల సమస్య ఉందని సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు
(JNTU) జేఎన్టీయూ యూనివర్సిటీతో పాటు నియోజకవర్గంలోని పలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వసతి గృహాలు కళాశాలలు అద్దె భవనాలలో ఉన్నాయని వాటికి సొంత భవనాలను ఏర్పాటు చేయాలన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app