లబ్ధిదారులకు లక్ష రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ –
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వేముల సత్యనారాయణ, కుర్ర మనిశేఖర్ గౌడ్,మాధగుంట లక్ష్మి గతంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిఎం సహాయానిధి కింద దరఖాస్తు చేసుకున్నారు. వారికి తన నివాసం వద్ద లక్ష రూపాయల సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణి చేశారు..
అనంతరం అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేద ప్రజలు సిఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…
సిఎంఆర్ఆఫ్ నిరుపేదలకు అండగా మారిందాన్నారు..
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అలాగే మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక కృషితో నియోజకవర్గంలో ప్రజాపాలన ద్వారా బడుగు,బలహీన వర్గాలకు అండగా నిలుస్తుంన్నారని కొనియాడారు..
ప్రజాపాలనలో పేద,మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహా కార్పొరేట్ రంగంలో వైద్యం అందించడంతో పాటు వైద్యనికి అయినా ఖర్చులు సిఎంఆర్ఆఫ్ ద్వారా పేదలకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో లబ్దిదారులు, బైరి శివకుమార్ గౌడ్, కూన రాఘవేంద్ర గౌడ్, కృష్ణ యాదవ్, జిమ్ వేణు, మహేందర్ రెడ్డి, మక్బూల్ బాయ్, మణికంఠ, నియోజకవర్గం ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..
