బాధితులకు న్యాయం చెయ్యండి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
సాక్షిత : కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం లోని సర్వేనెంబర్ 307 లో ప్రభుత్వ భూములు లో అక్రమంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు అని చెప్పి హైడ్రాధికారులు ఇండ్లను కూల్చివేయడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలే నష్టపోయారని కావున వాళ్లకు తగిన న్యాయం చేయాలని నేడు సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం హాయంలో భారీగా ప్రభుత్వ భూములు కబ్జాలు జరిగాయని దానికి అప్పటి నాయకులు, ప్రభుత్వము,అధికారులు అందరూ సహకరించడం వల్ల ప్రజలు కూడా తక్కువ ఖర్చుతో ఇంటి జాగాలు దొరుకుతున్నాయని ఆశించి ఆ స్థలాలనుకొని అక్కడ నిర్మాణాలు చేపట్టారని అప్పుడు కూల్చకుండా తాత్సారం చేసి ప్రజలు తమ కష్టార్జితం మొత్తం అక్కడ కూడబెట్టి నివసిస్తుంటే ఇప్పుడు అవి అక్రమ నిర్మాణాలని కూల్చివేయడం వల్ల వారికి తీవ్ర నష్టం కలిగిందని కాబట్టి ప్రభుత్వమే ఆ బాధితులను గుర్తించి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు లేక డబల్ బెడ్ రూమ్ లాంటి వి ఇచ్చే ఆదుకోవాలని ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి కి చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి శ్రీనివాస్, ఇమామ్, వంశీలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
