SAKSHITHA NEWS

కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలి – ఆదనవు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత.
….

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 21 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ నెల ఉదయం 9.00 నుండి మధ్యహం 12.00 గంటలవరకు ప్రధమ సంవత్సరం పరీక్షల తేదీ 24.5.2024 నుండి తేదీ 3.6.2024
వరకు తీరి పరీక్షలు అలాగే ద్వితీయ సంవత్సరం తేదీ 24.5.2024 నుండి 3.6.
2024 వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగునని అలాగే పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు అలాగే జిరాక్స్ కేంద్రాలు ముచివేయలని అన్ని కేంద్రాల వద్ద ప్రధమ చికిత్స కేంద్రాలు, నిరంతర విద్యుత్, త్రాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. సూర్యాపేటలో 8 కేంద్రాలు, తిరుమలగిరి లో ఒకటి, తుంగతుర్తి ఒకటి, నెమ్మికల్ లో ఒకటి కోదాడలో 5 కేంద్రాలు, నడిగూడెంలో ఒకటి, హుజూర్ నగర్ లో రెండు, నెరేడుచర్ల లో ఒకటి, మట్టం పల్లి లో ఒకటి చొప్పున ఏర్పాటు చేశామని తెలిపారు. ద్వితీయ సంవత్సరం 4.6.2024 నుండి 8.6
2024 వరకు ఉదయo 9.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు అలాగే మధ్యాహ్నం 2.00 నుండి 5.00 గంటల వరకు అదేవిదంగా ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష తేదీ. 10.6.2024 న ఉదయం 9.00 గంటలకు జరుగునని అన్నారు. అలాగే తేదీ.11.6.2024న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు జరుగునని తెలిపారు. అదేవిదంగా తేదీ.12.6.2024 న ఎథిక్స్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తహశీల్దార్ లు ప్లేయింగ్ స్క్వాడ్ లుగా నియమించడం జరిగిందని, పరీక్షా కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డి.ఐ.ఈ.ఓ కృష్ణయ్య, సెక్షన్ పర్యవేక్షకులు పద్మారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 05 20 at 17.07.30

SAKSHITHA NEWS