చీమలపాడు ఘటన చాల బాధకారం

Spread the love

పోలీస్ కమిషనర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో బుధవారం నాడు జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన బాధాకరమని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. జరిగిన సంఘటనను తెలుసుకున్న పోలీస్ కమిషనర్ నగరంలోని సంకల్ప హాస్పిటల్, ,ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. ఈఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని, ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా వుండి వైద్యశాలకు తరలించడం..
ఆనంతరం చికిత్స పొందితూ.. మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యం గురించి వైద్యులతో మాట్లాడినట్లు తెలిపారు. గాయపడిన బాధిత ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నవీన్ కుటుంబసభ్యులతో మాట్లాడిన పోలీస్ కమిషనర్ మెరుగైన వైద్యం అందిస్తునట్లు, ధైర్యంగా వుండాలన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page