ఆరోగ్యానికి వ్యాయామమే రక్షణ కవచం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…
సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ డివిజన్ లలో వడ్డెర బస్తిలోని 70 లక్షల రూపాయలతో సిసి రోడ్డు, పి.ఆర్. నగర్ లో 17 లక్షల రూపాయలతో నిర్మించిన ఓపెన్ జిమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోని పార్కులు.. ఇండోర్ స్టేడియంలు..షటిల్ కోర్ట్లు ఓపెన్ జిమ్లతో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ..ఆరోగ్యమే మహాభాగ్యంగా నేడు ప్రజలు కూడా ప్రతినిత్యం వ్యాయామానికి ఒక గంట సమయం కేటాయిస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిందిగా కోరారు..అందువల్ల పార్కుల్లో కూడా అత్యాధునిక సదుపాయాలతో ఓపెన్ జిమ్ లు ప్రారంభిస్తూ …ఈ విధంగా ముందుకు తీసుకొస్తున్నామని అన్నారు…ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్న ఎడల వెంటనే నన్ను సంప్రదించవచ్చని తెలిపారు…ఈ నేపథ్యంలో ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు… ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు, ghmc అధికారులు పాల్గొన్నారు.
ఆరోగ్యానికి వ్యాయామమే రక్షణ కవచం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…
Related Posts
వైకుంఠ ఏకాదశి పర్వదినంను పురస్కరించుకుని వివేకానంద నగర్
SAKSHITHA NEWS వైకుంఠ ఏకాదశి పర్వదినంను పురస్కరించుకుని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక…
కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 11 మంది
SAKSHITHA NEWS కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 11 మంది లబ్ధిదారులకు 11,01,276/- పదకొండు లక్షల ఒక వెయ్యి రెండు వందల డెబ్భై ఆరు రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపేణా లబ్ధిదారులకు అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి…