ఈ పవిత్ర గ్రంథాన్ని చదువుతున్నంత సేపు అల్లాహ్ తనతో మాట్లాడుతున్నాడు అనే భావన కలిగి ఉండాలి. చదివిన. వాక్యాలను మనసులో నింపుకొన్నప్పుడే జీవితంలో మార్పు సాధ్యమవుతుంది. ఖురాన్లో అల్లాహ్ అనుగ్రహాల ప్రస్తావన. పచ్చినప్పుడు హృదయం కృతజ్ఞతతో పొంగిపోవాలి. ప్రవక్తల గాథలు విన్నప్పుడు వారిని అనుసరించాలనే ప్రేరణ కలగాలి. దుర్మార్గులు, అత్యాచారుల గురించి చదివినప్పుడు వారిపట్ల విద్వేషు కలగాలి. పరలోకం, స్వర్గ, నరకాలు, ప్రళయం గురించి చదివినప్పుడు స్వర్గాన్ని సాధించాలన్న తపన ఏర్ప దాలి. నరకాగ్ని శిక్షలను చదివేటప్పుడు హృదయం కంపించి. పోవాలి. అలాంటి శిక్షల నుంచి కాపాడమని దైవాన్ని వేరుకో ఖుర్ఆన్ ను సుమధురంగా చదవాలి అంటారు. ప్రవక్త మయామ్మద్ (స), ప్రవక్త రోజంతా దైనందిన వ్యవహా రాల్లో లీనమై ఉన్నప్పటికీ ఖురాన్ పారాయణానికి రాత్రిని అనువైన సమయంగా భావించేవారు. సుదీర్ఘ సమయం నమాజులో నిలబడి ఖురాన్ పారాయణం చేసేవారు.
ఈ పవిత్ర గ్రంథాన్ని చదివేముందు కారుణ్యాన్ని, సన్మార్గాన్ని ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకోవాలి. దీనిని అత్యంత శ్రావ్యంగా (తజ్విజ్)తో పఠించేవారు స్వర్గదూతలతో ఉంటారు. ఖురాన్ వాక్యాలు అత్యంత శ్రద్ధతో వినాలన్నది. అల్లాహ్ సూచన. వాటిని వినడం అంటే అల్లాహ్ మనతో మాట్లాడుతున్నాడని అర్థం. ఇందులోని ఒక్క వాక్యం విన్నా..రెట్టింపు పుణ్యాలు లభిస్తాయి. అలాంటివారికి ప్రళయం రోజున ఖురాన్ వెలుగుగా దారి చూపు తుంది. ఖురాన్ పఠనాన్ని దిన చర్యలో భాగం చేసుకోవాలి. పలు సందర్భాల్లో ప్రవక్త (స) ఖురాన్లోని కొన్ని ప్రత్యేక వాక్యాలను పఠించేవారు. దానివల్ల అల్లాహ్ రక్షణ వెన్నంటి ఉంటుందన్నది ప్రవక్త ఉద్భోధ. నిద్రకు ఉపక్రమించే ముందు రెండో అధ్యాయంలోని “ఆయతుల్ కుర్సీ” వాక్యాలను తప్పకుండా పఠించే వారు. ఈ వాక్యాలు పఠించినవారి వెంట రాత్రంతా ఒక దైవదూత రక్షణగా ఉంటాడని ప్రవక్త చెప్పారు. దుష్ప్రరణల నుంచి రక్షణ కోసం “సూరె ఫలఖ్, సూరెనాస్ వాక్యాలు పఠించేవాడు. అనారోగ్యానికి గురైన ప్పుడు ఖురాన్ మొదటి అధ్యాయం ‘సూరె ఫాతిహా చదివి స్వస్థత పొందేవారు. ఖురాన్ మానవ జీవన గ్రంథం. మనో కాంక్షలను అణచిచేసే దివ్యసాధనం. వ్యక్తిత్వ వికాస గ్రంథం. జీవితానికి శాంతిని, పరలోక సాఫల్యాన్ని కలిగించే హితువు, ఎన్నో హృదయ రోగాలకు దివ్య ఔషధం. ఎన్నో సామాజిక రుగ్మతలకు చికిత్స. ఎన్నో సమస్యలకు పరిష్కారం :
షేక్ మదర్ సాహెబ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
9440449642