SAKSHITHA NEWS

మాతృదేవతారాధానతో కార్యసిద్ధి జరుగుతుంది : టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఓబీసీ డిక్లరేషన్ కో చైర్మన్ తోటకూర వజ్రేష్ యాదవ్…

గ్రామంలోని ప్రజలను దుష్టశక్తుల నుండి కాపాడేందుకు గ్రామ పొలిమేరలో వెలిసిన అమ్మవారు పోచమ్మ తల్లి అని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఓబీసీ డిక్లరేషన్ కో చైర్మన్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చెన్నాపూర్ లో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆహ్వానం మేరకు నిర్వహించిన పోచమ్మ తల్లి శిఖర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఓబిసి డిక్లరేషన్ కో-చైర్మన్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాతృదేవతారాధనతో చరాచర సృష్టిలోని ఏ కార్యమైనా సఫలీకృతమవుతుందని భావించిన మానవుడు గ్రామదేవతలను ఆరాధించడం మొదలుపెట్టాడని అందులో భాగంగానే మంత్ర తంత్రాలు, పవిత్రీకరణ, బలి వంటి పద్ధతుల ద్వారా అమ్మవార్లను సంతోష పెట్టి తమ కోరికలు నెరవేర్చుకునేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో ,డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు గొడుగు వేణు, బింగి సతీష్ గౌడ్, బల్లి శ్రీనివాస్,మనోహర్ రెడ్డి, సీనియర్ నాయకురాలు సుగుణ,జవహర్ నగర్ మహిళా అధ్యక్షురాలు లత,జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినయ్,రాజు యాదవ్,శ్రీను,మిట్టు తో పాటు ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS