BUDDET కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు పెంచాలి
తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్
తెలంగాణ లో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు పెంచాలి అని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి ఒక ప్రకటనలో తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో లో కల్లుగీత కార్మికుల సంక్షేమానికి కేవలం 68, కోట్లు నీరాకు 25 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కాటమయ్య రక్షణ కవచం ఆవిష్కరణ సభలో కల్లుగీత కార్మికులందరికీ ఉచితంగా సేఫ్టీ మొకులు ఇస్తామని చెప్పారు. రెండు లక్షల 50 వేల మంది సభ్యత్వం కలిగి ఉన్న వారిలో లక్ష మందికి ఇచ్చిన 90 కోట్లు అవసరం పడతాయి నక్లెస్ రోడ్ లో ఉన్న నీరా కేప్ కు అనుబంధంగా జిల్లాలలో ఏర్పాటుచేసిన మిషనరీ కి మరియు దీనిని అన్ని జిల్లాలకు విస్తరించడానికి కనీసం 100 కోట్ల బడ్జెట్ రుణాలు తదితర సంక్షేమం కోసం తగిన బడ్జెట్ అందుకని ప్రభుత్వం పునాలోచించి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి రాష్ట్రవ్యాప్తంగా చెట్ల పెంపకానికి భూమి, కల్లుకు మార్కెట్, నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలకు 5000 వేల కోట్లు కేటాయించాలని గత అనేక సంవత్సరాలుగా కల్లుగీత కార్మిక సంఘలు మరియు గౌడ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ ప్రభుత్వమైనా కనీసం 500 కోట్లు కేటాయిస్తుందని ఆశతో ఎదురు చూశాం. కానీ నిరాశ మిగిల్చింది అన్నారు.