SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 19 at 12.46.40 PM

కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ఎస్.సి. సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన రూ. 2.5 లక్షల చెక్కును అందచేసిన చేసిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో నివసించే గ్యార విజయ్ కుమార్ మరియు సంధ్య దంపతులు కులాంతర వివాహం చేసుకున్నందుకు డా. బి.ఆర్. అంబెడ్కర్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ పథకం, ఎస్.సి. సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన రూ. 2.5 లక్షల చెక్కును ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ వారి నివాసం వద్ద కార్యాలయంలో అందచేసారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కులాంతర వివాహం చేసుకున్నయువతీ యువకులు ఈ పథకాన్నిసద్వినియోగ పరుచుకోవాలని వారికీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.సి. సంక్షేమ శాఖ అధికారి కె.శ్రీకర్ రెడ్డి, వసతి గృహ సంక్షేమ అధికారులు నర్సింహా, కొండల్ రావు, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS