న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎం ఫాతిమా బీవి 96 ఏండ్ల వయసులో గురువారం తుదిశ్వాస విడిచారు..
అత్యున్నత న్యాయవ్యవస్ధలో ఉన్నత స్ధానానికి ఎదిగిన తొలి ముస్లిం మహిళగా కూడా ఆమె అరుదైన ఘనత సాధించారు. ఫాతిమా బీవి సుప్రీంకోర్టులో తొలి మహిళా జడ్జిగా 1992, ఏప్రిల్ 29న పదవీ విరమణ పొందే వరకూ కొనసాగారు.
రిటైరైన తర్వాత ఆమె జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. ఆపై తమిళనాడు గవర్నర్‌గానూ ఫాతిమా బీవి సేవలందించారు. ఇక సుప్రీం కోర్టు 71 ఏండ్ల ప్రస్ధానంలో 1989లో ఫాతిమా బీవీ మొదలుకుని కేవలం ఎనిమిది మంది మహిళలే న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. 1927 ఏప్రిల్ 30న కేరళలో జన్మించిన ఫాతిమా బీవీని న్యాయ విద్య అభ్యసించాలని తండ్రి ప్రోత్సహించారు.
1950లో బార్ కౌన్సిల్ పరీక్షలో ఆమె అగ్రస్దానంలో నిలిచి బార్ కౌన్సిల్ గోల్డ్ మెడల్ గెలుచుకున్న తొలి మహిళగా నిలిచారు.ఆపై అంచెలంచలుగా ఎదుగుతూ 1989లో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ఎదిగి చరిత్ర సృష్టించారు.