ఊరికి తొలి దేవత బొడ్రాయి – వడ్త్య దేవేందర్ నాయక్ గారు
మల్లేపల్లి సాక్షిత
మల్లేపల్లి మండలం పెండ్లిపాకల గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, యంపీపి జాను యాదవ్ లతో కలిసి
హాజరైన దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్
బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేందర్ నాయక్ మాట్లాడుతూ ఊరికి తొలి దేవత బొడ్రాయి అని అన్నారు. చారిత్రకంగా బొడ్రాయి ఉత్సవానికి గొప్ప సామాజిక ఉన్నదని అన్నారు. గ్రామ నిర్మాణానికి తొలి పునాది రాయి బొడ్రాయి అని అందువల్ల ఆనాటి నుంచి గ్రామానికి తొలి దేవతగా ప్రజలు భావిస్తారని అన్నారు. మన గ్రామీణ సాంప్రదాయంలో
పెళ్ళిండ్లు, పండుగలు, నూతనంగా చేపట్టిన పనులకు, ఆడబిడ్డ ఊరు దాటేటప్పుడు, కొత్త కోడలు వచ్చేటప్పుడు, సారె పెట్టినప్పుడు, సంబురమేదైనా తొలి మొక్కు అమ్మతల్లి రూపమైన బొడ్రాయికే చెల్లించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని అన్నారు. అలాంటి బొడ్రాయి ఉత్సవాలు ప్రజలంతా సమిష్టిగా జరుపుకోవడం పట్లా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలంతా కలిసికట్టుగా ఒక్కటై జరుపుకునే ఈ బొడ్రాయి ఉత్సవం వల్ల గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండడానికి తోడ్పాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేపల్లి జడ్పీటీసీ సలహాదారుడు యుగంధర్ రెడ్డి, సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, కేశాని లింగారెడ్డి, సర్పంచ్ వెంకట్ రెడ్డి, యంపీటిసి బిక్కు నాయక్, దొనియాల శ్రీను, మాజీ యంపీటిసి యాదగిరి, నక్క వెంకటేశ్ తదితరుల ఉన్నారు.