SAKSHITHA NEWS

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.. అతని భార్య వాణి మధ్య ఫైట్‌ పీక్‌ కి చేరింది.

ఇద్దరి మధ్య హైవోల్టేజ్‌ డైలాగ్‌ వార్‌ నడుస్తోంది.

ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రమ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగుచూస్తున్నాయి.

తనను చంపేందుకు ప్రయత్నించారంటూ దువ్వాడ శ్రీనివాస్‌ ఆరోపించారు.

ఆయన చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు వాణి. ఇద్దరి మధ్య జరిగిన హాట్‌ అండ్‌ హీట్‌ డైలాగ్‌ వార్‌ కొనసాగుతోంది.. ఈ క్రమంలో దువ్వాడ వాణిపై ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాణి, ఆమె అనుచరులను అరెస్ట్‌ చేయాలని శ్రీనివాస్‌ డిమాండ్ చేశారు. వాణి తన అనుచరులతో కలసి.. తన మీద హత్యాయత్నానికి ప్రయత్నించిందని తెలిపారు. వాణిని అరెస్ట్‌ చేసి తనకు రక్షణ కల్పించాలని కోరారు.

దువ్వాడ ఇంట్లో దుమారానికి ఈమె సెంటర్‌ పాయింట్‌గా దివ్వెల మాధురి మారారు.. దివ్వెల మాధురిపై ఘాటైన ఆరోపణలు చేశారు దువ్వాడ వాణి. తన భర్తను మాధురి ట్రాప్‌ చేసిందంటూ ఆమె కేరెక్టర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. వాణి ఆరోపణలకు అంతే దీటుగా కౌంటర్‌ ఇచ్చారు దివ్వెల మాధురి. వాణి తన స్వార్థం కోసం తమపై నిందలు వేశారంటోంది మాధురి. దీంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నామని తెలిపారు. అలాంటి సమయంలో దువ్వాడ శ్రీను తనకు అండగా నిలిచారని.. ఓ ఫ్రెండ్‌లా, కేర్‌టేకర్‌గా దువ్వాడ శ్రీను తనతో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీను, తాను కలిసే ఉంటున్నామని మాధురి వివరించారు.


SAKSHITHA NEWS