SAKSHITHA NEWS

The ED gave an explanation on the searches conducted at the house of Pathan Cheru MLA Goodem Mahipal Reddy

పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంటిపై జరిగిన సోదాలపై వివరణ ఇచ్చిన ఈడీ

పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ ప్రకటించింది. ఆయనతో పాటు ఆయన సోదరుడి ఇంట్లో జరిగిన సోదాల్లో ఈ విషయం బయటపడినట్టు తెలిపింది.సంతోష్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్‌ సప్లై సంస్థ అక్రమ మైనింగ్‌ ద్వారా ఆర్జించిన సొమ్మును స్థిరాస్తి వ్యాపారానికి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. అక్రమ మైనింగ్‌ నిధులను మనీలాండరింగ్‌ ద్వారా మళ్లించినట్లు అందిన ఫిర్యాదుతో ఈడీ బృందాలు పటాన్‌చెరులో పలు చోట్ల సోదాలు నిర్వహించాయి.
*
ఈ క్రమంలో లెక్కల్లో లేని రూ.19 లక్షల నగదు,ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సెల్‌ఫోన్లు మరియు బ్యాంక్ లాకార్ల తాళాలను సీజ్‌ చేయడంతోపాటు వీరి నివాసాల నుంచి పెద్దఎత్తున ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది.అవన్నీ ఇతరుల పేర్లతో రిజిస్టరై ఉండటంతో గూడెం సోదరులలు ఇద్దరికి బినామీలు ఉన్నారని సంచలన ఆరోపణలు చేసింది ఈడి,వాటి గురించి లోతుగా ఆరా తీయడం ద్వారా మనీలాండరింగ్‌పై ఆధారాలు లభిస్తాయని ఈడీ వెల్లడించింది
*
సంతోష్ స్యాండ్, సంతోష్‌ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలకు పాల్పడినట్టు తెలిపారు. 300 కోట్లలో మైనింగ్ అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్టు ఈడీ పేర్కొంది. బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలను గుర్తించినట్టు ఈడీ తెలిపింది. అక్రమ మార్గంలో సంపాంధించిన డబ్బు మొత్తాన్ని రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఈడీ వివరించింది.కొన్ని బ్యాంక్ లాకర్స్‌ను కూడా ఇంకా తెరవాల్సి ఉందన్నారు.
*
మధుసూదన్‌రెడ్డిపై తొలుత తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ప్రభుత్వం నుంచి లీజు ద్వారా అనుమతి తీసుకున్న స్థలంలో పరిమితికి మించి మైనింగ్‌ చేయడంతోపాటు ప్రభుత్వ భూమిలోనూ తవ్వకాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అలా అక్రమంగా వచ్చిన సొమ్ము 300 కోట్లు లావాదేవీలను బ్యాంకుల ద్వారా జరగకుండా చూసినట్లు దర్యాప్తు సందర్భంగా ఈడీ అధికారుల దృష్టికి వచ్చింది.


SAKSHITHA NEWS