SAKSHITHA NEWS

సెజ్ ఘటనలో మరణించిన వారికి కోటి రూపాయల ఆర్థిక సహాయం: జిల్లా కలెక్టర్

అమరావతి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలతో విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఈరోజు ఉదయం మాట్లాడారు.

విశాఖలోకి కేజీహెచ్ దగ్గర వారి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. మరణిం చిన వారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరి హారం చెల్లిస్తామంటూ కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందిస్తామని తెలిపారు.

కాగా ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 18కిచేరింది .ఈప్రమాదానికి కారణాలపై ఫ్యాక్టరీస్ విభా గం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది.

రియాక్టర్ లో తయారైన మిథైల్ టెర్ట్ బ్యూటైల్ ఈథర్ మిశ్రమాన్ని ట్యాంకు లోకి మార్చుతుండగా లికై ఆవిరిగా మారింది. ఆ వా యువు వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పం దించడంతో ఈ పేలుడు జరిగింది.

లీకేజ్ అయిన మిశ్రమం ఎలక్ట్రిక్ ప్యానల్ పై పడటంతో మంటలు చెలరేగాయని నివేదికలో పేర్కొంది. మరోవైపు ప్రమాదానికి కారణమైన ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు అయ్యింది.

ఈ ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. . మరణించిన వారి డెడ్ బాడీలకు పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన 40మందికి చికిత్సను అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలాన్ని ఏపీ సీఎం చంద్ర బాబునాయుడు ఈరోజు సందర్శించనున్నారు. మరణించినవారి కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.

అయితే ఇంత పెద్ద ప్రమా దం జరిగినా.. ఉద్యోగులు మరణించినా కంపెనీ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. హోం మంత్రి ఫోన్ చేసినా యాజమాన్యం స్పందించలేదని సమాచారం.

కంపెనీ యజమాని కిరణ్ కుమార్ అమెరికాలో ఉన్నట్లు తెలుస్తుంది. కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

WhatsApp Image 2024 08 22 at 11.20.37

SAKSHITHA NEWS