District officials should disclose Kharif seed details to farmers
జిల్లా అధికారులు ఖరీఫ్ విత్తన వివరాలను రైతులకు వెల్లడించాలి…….. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చంద్రయ్య
అధిక ధరల కు నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలనిడిమాండ్
సాక్షితవనపర్తి జూన్ 1
జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు అందుబాటులో ఉన్న విత్తన వివరాలను రైతులకు వెల్లడించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జె చంద్రయ్య జిల్లా కలెక్టర్ ను, జిల్లా వ్యవసాయ అధికారిని కోరారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో పత్తి విత్తనాలు కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం జిల్లా రైతులపై ఉందన్నారు. రైతులు వరి, వేరుశనగ ,మొక్కజొన్న ఆముదం, పత్తి, కంది తదితర పంటలు సాగు చేస్తానన్నారు. రోహిణి కార్తి రావటంతో బోర్ల కింద వరి నార్లు పోసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారన్నారు. జిల్లాలో రైతులు ఏ ఏ పంటలు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, ఎంత విత్తనం అవసరం, ప్రస్తుతం అందుబాటులో ఉన్న విత్తనం ఎంత అన్న వివరాలు ప్రకటించాలన్నారు. విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిస్తే రైతుల్లో ఆందోళన ఉండదన్నారు. కృత్రిమ కొరత సృష్టించి విత్తన డీలర్లు, వ్యాపారులు అధిక ధరకు రైతులకు అంటగట్టే ప్రమాదం తప్పుతుందన్నారు. నకిలీ, కల్తీ, విత్తనాలు నానాటికి పెరుగుతున్నాయని రైతులు నష్టపోతునే ఉన్నారన్నారు. మండల వ్యవసాయ అధికారులు, ఏ ఈ ఓ లు, ఎమ్మార్వోలు ప్రతినిత్యం విత్తన దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. విత్తనాలను అధిక ధరకు అమ్మకుండషాపుల వద్ద ధరలను నోటీసు బోర్డులపై పెట్టేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ, కల్తీ విత్తనాల అమ్మకం దారులు, బ్లాక్ మార్కెటీర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలన్నారు. పచ్చిరొట్ట ఎరువు కోసం జీలుగా, జనుము, పెసర విత్తనాలను 60 శాతం సభ్యుడిపై ఇస్తున్నామని చెబుతున్నారని జీలగ తప్ప ఇతర విత్తనాలు ఇవ్వటం లేదన్నారు. రైతుల డిమాండ్కు తగ్గ పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేయాలని కోరారు. విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, లేదంటే రైతుల సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, సిపిఐ గోపాల్పేట మండల మాజీ కార్యదర్శి శాంతన్న తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app
epaper Sakshitha
Download app