ఏపీలో సంచలనం సృష్టించిన దువ్వాడ మాధురి… వాణి …ల చర్చ
నేటితో దువ్వాడ ఫ్యామిలీ రచ్చకు ఫుల్ స్టాప్ పడుతోందా?
దువ్వాడ వాణి పెట్టిన షరతులేంటి..?
నేటితో దువ్వాడ ఫ్యామిలీ రచ్చకు ఫుల్ స్టాప్ పడుతోందా?
ఫ్యామిలి పెద్దల చర్చల్లో వాణి పెట్టిన పంచశీల డిమాండ్లు ఏంటీ?
వాటిపై ఆయన సోదరుడు ఏమన్నాడు?
దువ్వాడ వాణిపెట్టిన డిమాండ్స్ దువ్వాడ శ్రీను ఒప్పకుంటాడా?
ఆంధ్రప్రదేశ్ లో దువ్వాడ శ్రీనివాస్ వివాదం..ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత వారం రోజులుగా నడుస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీలో రచ్చకు ఫుల్ స్టాప్ పడుతుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఫైనల్‌గా ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ సభ్యుల చర్చలు ముగిసాయి. రెండు గంటల పాటు చర్చించిన దువ్వాడ బంధువులు.. 5 డిమాండ్లను దువ్వాడ సోదరుడితో చెప్పారు వాణి బంధువులు. ఆస్తుల పంపకం,విడాకులపై సుదీర్ఘంగా చర్చించారు ఇరువర్గాలు. పిల్లలను దృష్టిలో పెట్టుకొని విడాకులు వద్దని నచ్చచెప్పారు దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు. తాము జరిపిన చర్చలు సఫలం అవుతాయని ఈ రోజుతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని వాణి బంధువులు భావిస్తున్నారు. చర్చలు విషయం పక్కన పెడితే ఇంత జరిగాక తన అన్న విడాకులకే సిద్ధమయ్యారని చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్. మరోసారి అన్న దువ్వాడ శ్రీనివాస్‌తో మాట్లాడాక ఫైనల్ నిర్ణయం చెబుతామన్నారు శ్రీధర్.
దువ్వాడ శ్రీనివాస్, వాణి విషయం ఇలా ఉంటే యాక్సిండెట్ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధురి మాత్రం ఎమోషనల్‌గా మాట్లాడారు. హాస్పిటల్ నుంచి వీడియో విడుదల చేశారు మాధురి. మనుషుల్లో మానవత్వం ఉందనుకున్నా కానీ మోసం ఉంటుందని తెలుసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు మాధురి.
అయితే ఫైనల్‌గా వాణి, దువ్వాడ శ్రీను మధ్య ఎపిసోడ్ చర్చల్లో ఆర్ధిక పరమైన సమస్యలే చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వాణి పెట్టిన 5 డిమాండ్స్ పై దువ్వాడ శ్రీను ఏవిధంగా స్పందిస్తారు? ఆయన సోదరుడు ఒప్పిస్తాడా? అని దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ గొడవకు వాణి డిమాండ్స్ తో ఫుల్ స్టాప్ పడుతుందా? లేక దువ్వాడ ఏమైనా డిమాండ్స్ పెడతాడా? అనే ఉత్కంఠ రేపుతోంది. ఏదీ ఏమైనప్పటికీ ఈ వివాదం విషయంలో ఏ క్షణానికి ఏమవుతుందో అని టెక్కలి నియోజక వర్గ ప్రజలతో పాటు అందరి చూపు.