ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం
-గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలి
-మూడు నెలల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు నాయుడు
-డైవర్షన్ పాలిటిక్స్ నడపడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు
-ఉచిత ఇసుక పంపిణీ ఎక్కడ
-ఆవ భూముల వ్యవహారంలో డబ్బులు ఎవరి ఖాతాలకు వెళ్ళాయో నిగ్గు తేల్చాలి
-మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్
సాక్షిత రాజమహేంద్రవరం :
ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ నగర పార్టీ అధ్యక్షులు అడపా శ్రీహరి మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మార్త లక్ష్మి నక్క నగేష్ తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో గత ఎన్నికలలో ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి అధికారంలోకి వచ్చిన విధానంపై చర్చ జరుగుతుందని అన్నారు. ఎన్నికలు అయిన తర్వాత 45 రోజులు ఈవీఎం లను భద్రపరచవలసి ఉండగా ఎన్నికల నియమావళి ని తుంగలో తొక్కి ఈవీఎం లను, స్లిప్పులను నిర్వీర్యం చేశారని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుగోలు చేసి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల నుంచి ప్రజలను పక్కదో పట్టిస్తున్నారని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ నడపడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడని పేర్కొన్నారు. ఈవీఎంలను 12 గంటలు ఉపయోగించిన తర్వాత 99% బ్యాటరీ తగ్గుతుందని అయితే 21 రోజుల తర్వాత 99
శాతం ఈవీఎంలలో బ్యాటరీ రీఛార్జ్ ఏ
ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
సీసీ కెమెరాల ఫుటేజ్ పై టిడిపి నాయకులు సమాధానం చెప్పడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశం అని చెబుతున్న భారతదేశంలో ఈవీఎంల మాన్యు ప్లేట్
చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం దారుణం అన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం పై సమగ్ర వచారణ జరపాలని డిమాండ్ చేశారు. గుడ్లవల్లేరు సంఘటనను పక్కదారి పట్టించేందుకు ముంబాయి నుంచి పెయిడ్ ఆర్టిస్ట్ కాదంబరి ని
తీసుకొచ్చి సంఘటనను ప్రక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. 300 మంది విద్యార్థినులు తమకు జరిగిన అన్యాయంపై వెలుగెత్తి ప్రశ్నిస్తుంటే కాలేజీ యాజమాన్యం, ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా కాంటిన్ లో నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని అన్నారు. డ్రైనేజీలో నీటితో ప్లేట్లు కడుగుతున్నారని వివరించారు. నూజివీడు త్రిబుల్ ఐఐటీ హాస్టల్ లో భోజనం సౌకర్యం బాగాలేదని అన్నారు. ప్రభుత్వ స్కూల్లో విద్యావ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విష జ్వరాలతో, కలుషిత ఆహారంతో అనారోగ్యం పాలవుతున్నారని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్ అందించే వారిని తెలిపారు. చంద్రబాబు నాయుడు పాలనలో విద్యార్థులకు కుళ్ళిన కోడిగుడ్లు అందజేస్తున్నారని విమర్శించారు. హాస్టళ్లల్లో నాసిరకం ఆహార పదార్థాలు అందించి అద్వానంగా తయారు చేశారని అన్నారు. చంద్రబాబు మూడు నెలల పాలన అస్తవ్యస్తంగా తయారైందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారంలో మీడియాను ఎందుకు ప్రవేశించకుండా అడ్డుకున్నారని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్లే డ్యాం కు నష్టం వచ్చిందని కేంద్ర కమిటీ నిర్ధారించిందని తెలిపారు. దీనిని పక్కదారి పట్టించేందుకు పోలవరం కు సంబంధించిన ఫైల్స్ దగ్ధం అయినట్లు నాటకం ఆడి అమాయకులైన ఇరిగేషన్ అధికారులను సస్పెండ్ చేశారని తెలిపారు. ఒక విషయాన్ని కప్పిపుకోవడం కోసం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ కాంట్రాక్టర్ల నుంచి 5 శాతం కమిషన్ అడుగుతున్నాడని ఆరోపించారు. ఆవ భూముల వ్యవహారంలో డబ్బులు ఎవరి ఖాతాలో పడ్డాయో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో రాజమండ్రిలో లాలాచెరువు వద్ద పది కోట్లు విలువ గల ఇసుకను నిల్వ చేసామని ఆ ఇసుక ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. ప్రస్తుతం కృత్రిమ కొరత సృష్టించి ఇసుకను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసి యూనిట్ ఇసుక 6 వేల రూపాయలకు అమ్ముతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక హామీ ఏమయిందని ప్రశ్నించారు. అవినీతి జరిగితే గొంతెత్తి ప్రశ్నిస్తామని అన్నారు. ఈవీఎం లను మ్యానిపులేషన్ చేసి నెగ్గిన ఎమ్మెల్యే, ఈ .వీ.ఎం మ్యానిపులేషన్ చేసి నెగ్గిన ముఖ్యమంత్రి అని పిలుస్తామని అన్నారు. ఇదే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడప శ్రీహరి, వైసీపీ మహిళా అధ్యక్షురాలు
మార్తి లక్ష్మి,
వైసిపి నాయకులు నక్క శ్రీ నగేష్, మజ్జి అప్పారావు, వాసంశెట్టి గంగాధరరావు, బిల్డర్ చిన్న
మజ్జి అప్పారావు, ఎన్వి శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, గణేష్, వట్టికూటి కృష్ణవేణి, రేగుళ్ల నాని, కొమ్మజి దుర్గారావు, కుమారి
తదితరులు పాల్గొన్నారు.