SAKSHITHA NEWS

మోదీ ని విమర్శించే హక్కు ముఖ్యమంత్రి కి లేదు..
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-

కెసిఆర్ పిట్టల దొరైతే రేవంత్ బుడ్డఖాన్..

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్..

పెగడపెల్లి. భారత ప్రధానమంత్రి ప్రపంచంలోనే అత్యధిక బలమైన నాయకులు అని మోదీ ఏది చెప్తే అది చేస్తారని ప్రపంచంలోనే 2014 నుండి 2024 వరకు అగ్రరాజ్యమైన అమెరికాకు అధ్యక్షులు అయిన ఒబామా, జోబైడెన్,ట్రంపులు ప్రశంసలు కురిపిస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోడీ తెలంగాణ విషయంలో అబద్ధాలు మానుకోవాలని నేను నిజాలు చెప్పేందుకే మహారాష్ట్ర వచ్చానని చేసిన వ్యాఖ్యలు ఏనుగు పోతుంటే కుక్కలు మొరిగినట్లుందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ ఏద్దేవాచేశారు. ఈ సందర్భంగా మర్రిపెల్లి సత్యమ్ మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న ఆర్ గ్యారంటీలపై చెప్పదానికే మహారాష్ట్ర వచ్చారన్న ముఖ్యమంత్రి గత రెండు రోజుల క్రితం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కర్ణాటకలో ఐదు గ్యారంటీల పేరుతో కర్ణాటకలో తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో మహారాష్ట్రలో ఏడు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుందని కానీ బడ్జెట్ లేకుండా ఇవన్నీ అమలు చేయడం సాధ్యం కాదని అందుకే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకం ఎత్తివేసే ఆలోచనలో ఉందని ఇలాంటి ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరని వ్యాఖ్యానించినప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని అన్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలలో ఒక్క మహిళకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏది అమలు కావడం లేదని రెండు లక్షల రుణమాఫీపై మంత్రుల మధ్య ముఖ్యమంత్రి మధ్య సమన్వయం లేకపోవడంతో తలో మాటా మాట్లాడుతూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. ఖరీఫ్ పంట కాలం పూర్తయినా ఎకరాకు పదిహేను వేలు రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదని కౌలు రైతుల ప్రస్తావన ఎందుకు లేదని ఉపాధి కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఎందుకు ఇవ్వలేదని పెళ్లి చేసుకున్న ఆడపడుచులకు తులం బంగారం ఎందుకు ఇవ్వలేదని నాలుగు వేల పింఛను ఎందుకు ఇవ్వలేదని మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు బ్యాంకులో ఎందుకు వేయడం లేదని దళితులకు అంబేద్కర్ అభయహస్తం కింద పన్నెండు లక్షలు ఎందుకు ఇవ్వడం లేదని ఇంటర్మీడియట్ పై స్థాయి చదువుకునే విద్యార్థులకు స్కూటీ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముందుగా తొలి సంతకం ధరణి పోర్టల్ పైనే అని దాని ద్వారా రైతుల ఇబ్బందులు డిసెంబర్ 9 2023 తర్వాత తొలగిపోతాయని మాటలు చెప్పి తర్వాత 100 రోజులు అంటూ 336 రోజులు గడిచిన ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. ఇన్ని అబద్ధాలు ప్రచారం చేసి అధికారం కోసం అడ్డదారులు తొక్కిన ముఖ్యమంత్రికి మోడీజీని విమర్శించి నైతిక హక్కు లేదని మోడీని విమర్శించడం అంటే సూర్యుడిపై ఉమ్ము వేయడం లాంటిదేనని అన్నారు. మోదీ నల్ల చట్టాలు అమలులోకి తెచ్చి అంబానీ ఆదానీలకు మేలు చేశారన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దావోస్ పర్యటనలో అంబానీ ఆదానీలను ఎందుకు కలిశారో సమాధానం చెప్పారని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను దోచుకోవడంలో బీఆర్ఎస్,కాంగ్రెస్ ఒక్కతాను ముక్కలేనని బిఆరెస్ ప్రభుత్వం లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల అవినీతి పాల్పడి దోచుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూసినది సుందరీకరణ పేరుతో లక్షా యాభై వేల కోట్లతో తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుని దాచుకోవడానికి ముందుకు వెళుతుందని అన్నారు. రైతు రుణమాఫీ కోసం 36 వేల కోట్లు రిలీజ్ చేసామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు 17,869 కోట్లు ఇచ్చామని చెప్పడం వడ్లకు 500 బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతన్నారని ఇవన్నీ చూస్తే ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో ఎవరు అబద్ధాలు ఆడడం మానుకోవాలో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు…

WhatsApp Image 2024 11 11 at 12.02.31 AM

SAKSHITHA NEWS